గుడ్ న్యూస్ .. తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు దేశ వ్యాప్తంగా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

Update: 2022-06-22 01:37 GMT

బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో.. తగ్గుతుందో చెప్పలేం. పెరుగుదలకు అనేక కారణాలుంటాయి. ఆ కారణాలు వెతుక్కునే పనిలో పడే కన్నా బంగారం ధర ఎప్పుడు ఎంత ధర ఉన్నది తెలుసుకోవడమే మేలని భావిస్తారు. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు వంటి కారణాలతో బంగారం ధర పెరుగుదలను మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి అట్టి డిమాండ్ ఉండటమే కారణం. ముఖ్యంగా భారతీయ మహిళలు అత్యంతగా ఇష్టపడే బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు స్వల్పంగా తగ్గుతుంటాయి.

హైదరాబాద్ లో...


తాజాగా బంగారం ధరలు దేశ వ్యాప్తంగా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,980 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,650 రూపాయలు ఉంది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో వెండి కిలో ధర 66,300 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News