పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి

Update: 2022-04-07 01:00 GMT

బంగారం ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల పెరుగుదల లేకపోవడంతో పసిడి ప్రియులు ఆనందపడుతున్నారు. బంగారం ధరలు తగ్గడం, స్థిరంగా ఉండటం అనేది అరుదుగా ఉంటుంది. బంగారానికి ఉన్న డిమాండ్ ను బట్టి దాని ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ప్రధానంగా భారత్ లో పసిడి పట్ల మగువలు అత్యంత ఇష్టపడటం కారణంగా సీజన్ లకు అతీతంగా దాని డిమాండ్ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అలాంటి బంగారం అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులనో, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణమనో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కానీ గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.

తగ్గిన వెండి ధరలు...
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,800 రూపాయలుగా ఉంది. అదే 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,140 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి 70,700 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News