పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి.
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి. మార్కెట్ నిపుణులు చెప్పినట్లు బంగారం ధరలు ఎప్పుుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో? చెప్పలేం. అంతర్జాతీయ ఒడిదుడుకులను అనుసరించి బంగారం ధరల్లో మార్పులు చేటు చేసుకుంటాయి. మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను బట్టి కూడా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయన్నది మార్కెట్ నిపుణులు అంచనా. అందుకే బంగారం ధర తగ్గిన వెంటనే కొనుగోలు చేయడం మంచిదని వారు సూచిస్తుంటారు.
ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం, ధరలు స్వల్పంగా పెరిగాయి. పదిగ్రాముల బంగారంపై రెండు వందల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,040 గా రూపాయలుగా ఉంది. ఇది స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 47,700 రూపాయలు గా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 68,800 రూపాయలుగా ఉంది.