షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే?

ఈరోజు దేశంలో బంగారం ధర పెరిగింది. పది గ్రాముల బంగారం పై రూ.430ల వరకూ ధర పెరిగింది. వెండి కిలో రూ.1,150లు పెరిగింది

Update: 2022-06-17 01:55 GMT

బంగారం ధరల హెచ్చు తగ్గులు మామూలే. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. పసిడికి భారత్ లో మంచి డిమాండ్ ఉంది. భారతీయ మహిళ పసిడి అంటేనే పడి పోతుంది. సంప్రదాయం ప్రకారం పసిడికి ప్రతి భారతీయ ఇంట ఇక విశిష్టత ఉండటమే ఇందుకు కారణం. పెళ్లిళ్లలకు, పబ్బాలకు పసిడి కొనుగోళ్లు మరింత ఎక్కువగా ఉంటాయి. అయితే అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న నిల్వలు వంటి కారణాలతో బంగారం ధరల హెచ్చు తగ్గులుంటాయి. బంగారాన్ని అపురూపంగా భావించే భారత్ లో పసిడి ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. అప్పుడపపుడు తగ్గుతూ ఉంటుంది.

వెండి కూడా...
ఈరోజు దేశంలో బంగారం ధర పెరిగింది. పది గ్రాముల బంగారం పై రూ.430ల వరకూ ధర పెరిగింది. వెండి కిలో రూ.1,150లు పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,870లుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,550 రూపాయలు ఉంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 66,000లుగా ఉంది.


Tags:    

Similar News