గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి

దేశంలో బంగారం స్వల్పంగా, వెండి ధర భారీగా తగ్గింది. పది గ్రాముల బంగారంపై రూ.200లు, వెండి ధర రూ.1,000 వరకూ తగ్గింది.

Update: 2022-07-01 02:24 GMT

gold silver rates in hyderabad

బంగారం ధరలు తగ్గడం, పెరగడం మామూలే. అయితే తగ్గినప్పుడు స్వల్పంగా పెరిగినప్పుడు భారీగా పెరగడం బంగారం విషయంలోనే చూస్తాం. భారత్ లో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. కాలాలతో సంబంధం లేకుండా దాని కొనుగోళ్లు జరుగుతుంటాయి. భారతీయ కుటుంబాల్లో బంగారం ఒక ప్రధాన వస్తువుగా మారడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. అంతర్జాతీయ ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు వంటి కారణాలు బంగారంపై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.

ధరలు ఇలా...
తాజాగా దేశంలో బంగారం స్వల్పంగా, వెండి ధర భారీగా తగ్గింది. పది గ్రాముల బంగారంపై రూ.200లు, వెండి ధర రూ.1,000 వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.50,890లుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,650 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 65,100 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News