పసిడి ధర అదిరింది
దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారంపై వెయ్యి రూపాయలు పెరిగింది. వెండి కూడా భారీగానే పెరిగింది
బంగారం ధరలు తగ్గాయని సంతోషించేలోగానే భారీగా పెరగడం మామూలే. కొనుగోలు దారులు కూడా దీనికి అలవాటు పడి పోయారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కానీ ఇవేమీ లేకపోయినా పెరిగిన రోజులున్నాయని కొనుగోలుదారులు అంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ధరలు పెరిగితే సామాన్య, మధ్య, పేద వర్గాలకు భారంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
80 వేలకు వెండి...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారంపై వెయ్యి రూపాయలు పెరిగింది. వెండి కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి పై 2,490 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56.250 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,360 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 80,700 రూపాయలకు చేరుకోవడం విశేషం.