స్థిరంగా బంగారం ధరలు
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం అంటేనే మగువలకు ప్రీతి. బంగారాన్ని గౌరవానికి చిహ్నంగా చూస్తారు. ఒంటిపైన ఉన్న బంగారు ఆభరణాలను బట్టి గౌరవమిస్తారు. అందుకే బంగారం అంటేనే మహిళలు అత్యంత ఇష్టపడతారు. మరికొంత మంది బంగారాన్ని ఆభరణాలుగా మాత్రమే కాకుండా పెట్టుబడిగా కూడా చూస్తున్నారు. రోజురోజుకూ ధరలు పెరుగుతుండటంతో బంగారాన్ని భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడిగా చూస్తున్నారు. ప్రధానంగా భారత్ లో ఇటీవల కాలంలో ఈ సంస్కృతి పెరిగింది. అందుకే దేశ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరిగింది.
ధరలు ఇలా....
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,340 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,000 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కిలో వెండి ధర 63,500 రూపాయలుగా ఉంది.