పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

దేశంలో బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.200, 24 క్యారెట్ల పదిగ్రాముల పై రూ.230లు తగ్గింది.

Update: 2022-06-25 02:08 GMT

బంగారం ధరలు తగ్గడం, పెరగడం అంటే అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల ప్రభావమే కారణం. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం కూడా మరో కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతారు. కానీ భారత్ లో బంగారానికి ఉన్న డిమాండ్ మరే వస్తువుకు ఉండదు. గతంలో బ్యాంకుల్లో పొదుపు చేసే వారు సయితం ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. బంగారానికి రోజురోజుకూ విలువ పెరుగుతుండటమే అందుకు ప్రధాన రీజన్ గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.

స్వల్పంగా తగ్గిన...
తాజాగా దేశంలో బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.200, 24 క్యారెట్ల పదిగ్రాముల పై రూ.230లు తగ్గింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,760 రూపాయలు ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,750 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 66,000లుగా ఉంది.


Tags:    

Similar News