మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.220ల వరకూ తగ్గింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది.
బంగారం ధరలు తగ్గినా, పెరిగినా పెద్దగా పట్టించుకోరు భారతీయ మహిళలు. వారి శక్తిని బట్టి కొనుగోలు చేస్తుంటారు. ఆభరణాల కొనుగోలు మాత్రమే కాకుండా బంగారాన్ని పెట్టుబడిగా పురుషులు సయితం భావిస్తున్నారు. అందుకే బంగారం మీద పెట్టుబడి ఎక్కువగా పెడుతున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపుతుంటాయి.
వెండి ధర...
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.220ల వరకూ తగ్గింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,760 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,450 రూపాయలు ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 66,000 రూపాయలుగా ఉంది.