పసిడిప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం

బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాములపై రూ.600 లు బంగారం ధర పెరగగా, వెండి కిలోకు వెయ్యి రూపాయల చొప్పున పెరిగింది

Update: 2022-06-12 02:46 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, బంగారం నిల్వలు, డిమాండ్ వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులుంటాయి. తాజాగా ద్రవ్యోల్బణం కూడా బంగారం ధర పెరగుదల, తగ్గుదలకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ఎంత పెరిగినా డిమాండ్ మాత్రం అధికంగా ఉంటుంది. నిత్యం జ్యుయలరీ షాపులు సీజన్ తో సంబంధం లేకుండా కిటకిటలాడి పోతుంటాయి. అందుకే బంగారాన్ని కొనుగోలు చేయడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది.

హైదరాబాద్ మార్కెట్ లో....
తాజాగా బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాములపై రూ.600 లు బంగారం ధర పెరగగా, వెండి కిలోకు వెయ్యి రూపాయల చొప్పున పెరిగింది. హైదరాబాద్ లో బులియన్ మార్కెట్ లో ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం 48,350 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,750 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కూడా బాగా పెరిగింది. కిలో వెండి ధర 67,00 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News