బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధర

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర మాత్రం తగ్గింది

Update: 2022-04-03 02:25 GMT

మహిళలు ఎక్కువగా ఇష్టపడేది బంగారం. వస్త్రాలంకరణతో పాటు బంగారంపై కూడా మోజు ఎక్కువగా భారతీయ మహిళలు పడుతుండటంతో దానికి డిమాండ్ రోజురోజుకూ ఎక్కువవుతుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఏ మాత్రం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కన్పిస్తాయి. బంగారం ధర పెరగడమే కాని తగ్గడం అనేది అరుదు. అందుకే మహిళలు కూడా బంగారం ధర పెరుగుదలపై మానసికంగా ఎప్పటికప్పుడు సిద్ధపడిపోతున్నారు. తమ వద్ద ఉన్న నగదు ను బట్టి వారు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.

తగ్గిన వెండి.....
తాజాగా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,950 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరద 52,310 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.800 ల వరకూ తగ్గింది. దీంతో హైదరాబాద్ లో కిలో వెండి ధర 71,300 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News