గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధరలు

బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ఈరోజు స్థిరంగా కొనసాగుతుంది

Update: 2022-06-14 02:04 GMT

బంగారం అంటే అందరికీ మక్కువ. కాలాలతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేసేది ఒక్క బంగారమే. అందుకే బంగారానికి అంత డిమాండ్ ఉంది. బంగారం ధరల హెచ్చు, తగ్గుదలను ఎవరూ పట్టించుకోవడం లేదు. తమ వద్ద ఉన్న నగదుతో వచ్చిన బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుండటంతో జ్యుయలరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల ప్రభావం బంగారం ధరలపై ఉంటుంది. అంతే కాకుండా బ్యాంకుల వద్ద ఉన్న పసిడి నిల్వలు, ద్రవ్యోల్బణం కూడా బంగారం పెరుగుదల, తగ్గుదలకు కారణమవుతుంటుందని నిపుణులు చెబుతుంటారు.

తగ్గిన వెండి...
తాజాగా బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ఈరోజు స్థిరంగా కొనసాగుతుంది. హైదరాాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,760 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,360 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర మాత్రం ఈరోజు స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 67,300 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News