మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం !

హరియాణాలోని సోనీపత్ లో ఈ ‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’ ప్లాంట్ ఉంటుంది. ఆ సంస్థ తమ ప్లాంట్ లో 12 నిబంధనలను..

Update: 2022-10-12 11:00 GMT

Maiden Pharmaceuticals 

భారత్ కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్ లు తాగడం వల్ల పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్టోబర్ 6న ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ ఉత్పత్తులను వాడొద్దని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేసింది. కానీ.. మైడెన్ సంస్థ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. తాజాగా ఆ సంస్థ ఉత్పత్తులపై హరియాణా ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది.

హరియాణాలోని సోనీపత్ లో ఈ 'మైడెన్ ఫార్మాస్యూటికల్స్' ప్లాంట్ ఉంటుంది. ఆ సంస్థ తమ ప్లాంట్ లో 12 నిబంధనలను ఉల్లంఘించిందని గుర్తించడంతో ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ మీడియాతో మాట్లాడుతూ.. 'మైడెన్ ఫార్మాస్యూటికల్స్'కు చెందిన మూడు ఔషధాల శాంపిళ్లను కోల్ కతాలోని కేంద్ర ఔషధ ప్రయోగశాలకు పంపినట్లు చెప్పారు. వాటి రిపోర్టులు వచ్చాకే తాము చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్లాంట్ లో కేంద్ర, రాష్ట్ర అధికారులు సోదాలు జరిపి 12 ఉల్లంఘనలను గుర్తించినట్లు చెప్పారు.







Tags:    

Similar News