భారీ వర్షాలు, వరదలు 100 మంది మ్రుతి ..!
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, వరదలు 100 మంది మ్రుతి
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, వరదలు
100 మంది మ్రుతి, 1100 మందిని సుర క్షిత ప్రాంతాలకు
జారిపడిన కొండచరియలు, రవాణా బంద్
మరో రెండు రోజులపాటు ఇదే పరిస్తితి
బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం
నాలుగైదు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించనున్న వర్షాలు
హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో జనజీవితం స్థంభించింది. కొంచరియలు జారిపడటంతో రవాణా సౌకర్యాలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా ఇప్పటివరకు 100 మంది మ్రుతి చెందినట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుకవీందర్ సింగ్ సుకు చెప్పారు. 1100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, సహాయ పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. వరదలకు పలు భవనాలు కుప్పకూలాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్తితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నాలుగైదురోజుల్లో ఈశాన్య రాష్ట్రాలకు వర్షాలు విస్తరిస్తాయన్నారు. ఒడిశా, జార్ఖండ్ ల్లో శుక్రవారం వరకు వానలు పడతాయని, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అండమాన్, అండ్ నికోబార్ , అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలకు శుక్రవారం నుంచి భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.