Aravind Kejrival : కేజ్రీవాల్ కు నో రిలీఫ్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఊరట దక్కలేదు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై హైకోర్టు తీర్పు వెలువడింది. అయితే ఆయనకు ఊరట దక్కలేదు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఢిల్లీలిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైెరెక్టరేట్ అధికారులు సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విఫలమయిందని ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
ఈడీ వాదనలను...
బెయిల్ పిటీషన్ పై నిర్ణయం తీసుకునేముందు పూర్తి స్థాయిలో ఆలోచన చేయలేదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. బెయిల్ పై విచారణ సమయంలో ఈడీకి తగిన అవకాశం ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు రావడంతో ఇప్పుడు కేజ్రీవాల్ అభ్యర్థనను సుప్రీంకోర్టులో ఏం తీర్పు చెప్పనుందోనన్నది మరోసారి ఉత్కంఠగా మారింది. సుప్రీంకోర్టు కేజ్రీవాల్ పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే విచారిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.