Breaking : భారత్‌లో భారీగా కరోనా కేసులు
24 గంటల్లో భారత్ లో 10,158 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది
భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత ఏడాదిలో ఇంత పెద్దమొత్తంలో కేసులు నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. 24 గంటల్లో 10,158 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. మరోసారి కోవిడ్ నిబందనలను అమలుపర్చేలా రాష్ట్రాలను ఆదేశించే అవకాశాలున్నాయని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.
అప్రమత్తంగా ఉండాల్సిందే...
ప్రస్తుతం యాక్టివ్ కేసులు కూడా 50 వేలు దాటాయి. మరో రెండు వారాలు కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతాయని, తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటిస్తే ఖచ్చితంగా వైరస్ ను అదుపులోకి తేవచ్చని చెబుతున్నారు. రాష్ట్రాలు కూడా జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ ను కూడా నిర్వహించింది.