జనవరిలో ఒమిక్రాన్ డేంజర్ బెల్స్
జనవరిలో ఒమిక్రాన్ కేసులు పెరిగే అవకాశముందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫ్రెసర్ విద్యాసాగర్ రావు తెలిపారు.
జనవరి నెలలో ఒమిక్రాన్ కేసులు పెరిగే అవకాశముందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫ్రెసర్ విద్యాసాగర్ రావు తెలిపారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ బృందం ప్రత్యేకంగా కోవిడ్ ట్రాకర్ వెబ్ సైట్ ను ప్రారంభించింది. జనవరి నెలలో దేశ వ్యాప్తంగా 1.5 లక్షల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యే అవకాశముందని ఆయన తెలిపారు. కోవిడ్ టీకా తీసుకున్న వారిలో కూడా ఇమ్యునిటీ దెబ్బతినే అవకాశముండటంతో ఈ కేసులు మరింత పెరుగుతాయన్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను....
దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని ఆయన కోరారు. యువతలో ఈ వైరస్ పెద్దగా హాని కలిగించే అవకాశం లేదని పేర్కొన్నారు. జనవరి నెలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే ఈ గండం నుంచి బయటపడే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.