మహిళల భద్రత కోసం కొత్త ఆయుధం.. సరికొత్త రివాల్వర్

దేశంలో మహిళలకు భద్రత కరువైంది. ఈ మధ్య కాలంలో మహిళలపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని ఉత్తరప్రదేశ్ లో..

Update: 2023-08-15 14:01 GMT

దేశంలో మహిళలకు భద్రత కరువైంది. ఈ మధ్య కాలంలో మహిళలపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని ఉత్తరప్రదేశ్ లో మాత్రం మహిళలపై ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ప్రభుత్వ యాజమాన్య సంస్థ అయిన అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (AWEIL) ఓ రివాల్వను తయారు చేసింది. ఈ వెపన్స్ ఇండియాలో మొట్టమొదటి లాంగ్ రేంజ్ రివాల్వర్ ‘ప్రబల్’ ఈనెల 18వ తేదీన విడుదల కానుంది.

అయితే గతంలో తయారు చేసిన రివాల్వర్ రేంజ్ కేవలం 20 మీటర్లు మాత్రమే కాగా, ఈ కొత్త వెన్షన్ తో తయారు చేసిన రివాల్వర్ దాదాపు 50 మీటర్ల వరకు రేంజ్ ఉంటుందట. ఈ రివాల్వర్ ముఖ్యంగా మహిళల భద్రతలోకీలక పాత్ర పోషస్తుందని తయారు చేసిన సంస్థ చెబుతోంది. అంతేకాదండోయ్ దీని బరువు కూడా అతి తక్కువేనట. డబుల్ రేంజ్ లో వచ్చిన ఈ రివాల్వర్ పట్ల మహిళలు సైతం ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాల నేపథ్యంలో దీనిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతారని తెలుస్తోంది. ఈ రివాల్వర్ 76మి.మీ సైజుతో కేవలం 700 గ్రాములు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. లైసెన్స్ తో ఉండే ఈ రివాల్వర్ ను ఆసక్తిగల మహిళలు కొనుగోలు చేయవచ్చని సదరు కంపెనీ తెలిపింది.

అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ పునర్ నిర్మాణంలో భాగంగా ఏడు పీఎస్ యూలను 2021 సంవత్సరంలో ఏర్పాటు చేసింది. వాటిలో ఏడబ్ల్యూఈఐఎల్‌ కూడా ఒకటి. ఈ సంస్థ భద్రతా దళాల కోసం ఆయుధాలను తయారు చేస్తుంది. ఒక్క సంవత్సరంలో ఈ సంస్థ రూ.6వేల కోట్ల విలువైన ఆయుధాలను తయారీ ఆర్డర్లను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇతర దేశాలకు చెందిన ఆర్డర్లను సైతం సొంతం చేసుకుందని, వీటి విలువ సుమారు రూ. 450 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

Tags:    

Similar News