నేడు మన్మోహన్ సింగ్ పార్ధీవ దేహానికి అంత్యక్రియలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో కాశ్మీర్ గేట్ సమీపంలోని నిగమ్ బోత్ వద్ద అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఉదయం 11.45 గంటలకు మతపరమైన కార్యక్రమాలతో ప్రారంభించి తర్వాత దహన సంస్కారాలు చేయనున్నారు. ఈ అంత్యక్రియల్లో ప్రధాని మోదీతో పాటు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్ సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు పాల్గొంటారు.
ఏఐసీసీ కార్యాలయానికి...
ఉదయం ఎనిమిది గంటలకు మన్మోహన్ సింగ్ పార్ధీవదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తీసుకు వచ్చి అక్కడ కార్యకర్తలు, ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. ఉదయం 9.30 గంటల వరకూ ఏఐసీసీ కార్యాలయంలోనే మన్మోహన్ సింగ్ పార్ధీవ దేహం ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించిన అనంతరం అంతిమయాత్రగా పార్ధీవ దేహాన్ని నిగమబోధ్ ఘాట్ కు తరలించనున్నారు. మన్మోహన్ సింగ్ కుమార్తె అమెరికా నుంచి నిన్న రావడంతో ఈరోజు ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి.