కన్నడనాట.. కుమారస్వామి నోట

కర్ణాటక శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జేడీఎస్ నేత కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు;

Update: 2023-03-28 09:15 GMT
కన్నడనాట.. కుమారస్వామి నోట
  • whatsapp icon

కర్ణాటక శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జేడీఎస్ నేత కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. 148 నియోజకవర్గాల్లో తాము బరిలోకి దిగుతున్నామని ప్రకటించారు. ఒంటరిగానే బరిలోకి దిగి తిరిగి నిర్ణయాత్మక శక్తిగా మారతామని కుమారస్వామి తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా జేడీఎస్ ఎనభై స్థానాల్లో గెలవడం ఖాయమని ఆయన అనడం చర్చనీయాంశంగా మారింది.

ఈసారి కూడా...
ఈసారి కూడా తాను కింగ్ మేకర్‌గా మారబోతున్నానంటూ కుమారస్వామి ప్రకటించారు. అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులు బలంగా ఉన్నారని, తమకు బలం ఉన్న చోట మాత్రమే పోటీ చేస్తామని చెప్పారు. 148 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఈసారి కూడా జేడీఎస్ సత్తా ఏంటో చూపుతామని తెలిపారు. కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే తక్కువ స్థానాలు వచ్చినా ఆ పార్టీతో పొత్తుపెట్టుకుని కుమారస్వామి ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News