న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
కోవిడ్ సమస్య తీవ్రమవుతుందన్న వైద్య నిపుణుల హెచ్చరికతో కర్ణాటక ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది
కోవిడ్ సమస్య తీవ్రమవుతుందన్న వైద్య నిపుణుల హెచ్చరికతో కర్ణాటక ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబరు 31వ తేదీ రాత్రి ఒంటిగంటలోపే నూతన సంవత్సర వేడుకలను ముగించాలని పేర్కొంది. బీఎఫ్ 7 వేరియంట్ తో ముప్పు ఉందన్న హెచ్చరికలతో మాస్క్ లను తప్పని సరి చేసింది. విద్యాసంస్థలు, సినిమా థియేటర్లలో మాస్క్ లు విధిగా ధరించాలని ఉత్తర్వుల్లో కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది.
కోవిడ్ నిబంధనలను...
కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్ లు, రెస్టారెంట్లు, బార్లలో ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలని పేర్కొంది. వేడుకలు జరిగే చోట పరిమితికి మించి జనం గుమి కూడరాదని పేర్కొంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ తెలిపారు.