నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాల దిశగా

ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

Update: 2025-01-01 04:11 GMT

ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా రైతుల అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలిసింది. ఇప్పటికే ప్రధాని మోదీ రైతులకు తీపి కబురు అందించారు. పీఎం కిసాన్ సమ్మాన్ మొత్తాన్ని ఆరు వేల నుంచి పది వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

పలు ప్రాజెక్టులకు...
ఈ ప్రతిపాదనకు నేడు జరిగే మంత్రి వర్గ సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశముందని తెలిసింది. దీంతో పాటు ఉద్యోగాల కల్పన విషయంలోకూడా ఒక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. అలాగే పలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమదోదం తెలిపే అవకాశముందని చెబుతున్నారు. కొత్త ఏడాది తొలి రోజున జరిగే సమావేశం కావడంతో మంచి నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.


Tags:    

Similar News