Manmohan Singh : మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి

Update: 2024-12-28 07:27 GMT

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నిగమ్ బోధ్ లో ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. ఉదయం ఏఐసీసీ కార్యాలయం లో కొద్దిసేపు ఉంచిన ఆయన పార్థీవదేహానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి బోథ్ వరకూ అంతిమయాత్ర ప్రారంభమైంది.


అధికారిక లాంఛనాలతో...

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థీవదేహం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. అంత్యక్రియల్లో ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, కేంద్రమంత్రి అమిత్ షా తో పాటు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ పార్థీవదేహానికి భూటాన్ రాజు నివాళులర్పించారు.




Tags:    

Similar News