Sabarimala : నేటి నుంచి తెరుచుకోనున్న శబరిమల ఆలయం

నేటి నుంచి శబరిమల ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి.;

Update: 2024-12-30 03:32 GMT
ayyappa, darshan, today, sabarimala
  • whatsapp icon

నేటి నుంచి శబరిమల ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆలయాన్ని మూసివేసిన పూజారులు నేడు తెరవనున్నారు. మకర విళక్కు పూజల కోసం సాయంత్రం ఐదు గంటలకు శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని ట్రావెన్స్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుంచే సంప్రదాయ బద్ధంగా పూజలు ప్రారంభమవుతాయి.

అధిక సంఖ్యలో...
అదే సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆలయ అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల రికార్డు స్థాయిలో భక్తులు శబరిమలకు చేరుకున్నారు. లక్షల సంఖ్యలో చేరుకున్నా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. మహిళ భక్తులకు సయితం ప్రత్యేక గదులను ఏర్పాటు చేసిన బోర్డు మళ్లీ రద్దీ పెరిగే అవకాశముండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే రావాలని అధికారులు తెలిపారు.



Tags:    

Similar News