PSLV 60 : పీఎస్ఎల్వీ 60 రాకెట్ విజయవంతంగా నింగిలోకి

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ 60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

Update: 2024-12-31 01:52 GMT

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ 60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్త నిర్వహించిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది. రాత్రి 10.15 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ 60 కక్షలోకి ప్రవేశించింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలలో సంబంరాలు అంబరాన్ని అంటాయి. తమకు లభించిన అద్భుతమైన విజయంగా భావించారు.

మైలురాయిగా...
అంతరిక్ష పరిశోధనలో ఈ ప్రయోగం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. స్సేస్ డాకింగ్ టెక్నాలిజీని సాదించిన నాలుగు దేశంగా భారత్ ప్రపంచ దేశాల సరసన నిలిచింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపడంలో సఫలమయ్యారు. దేశంలో అనేక మంది శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మరిన్ని విజయాలను ఇస్రో సాధించాలని పలువురు ఆకాంక్షించారు.


Tags:    

Similar News