Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చప్పింది.
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చప్పింది. మండల పూజలకు వచ్చే అయ్యప్ప భక్తులు సులువుగా దర్శనం చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్ ను ప్రవేశ పెట్టినట్లు తెలిపింది. శబరిమల - పోలీస్ గైడ్ అనే పోర్టల్ ఇంగ్లీష్ లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ పోర్టల్ లో భక్తులకు అవసరమైన సమాచారాన్ని మొత్తాన్ని ఉంచామని తెలిపింది.
ప్రత్యేక పోర్టల్ లో...
పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్లతో పాటు పోలీస్ స్టేషన్ నెంబర్లు, హెల్త్ ఎమెర్జెన్సీ సేవల నెంబర్లు, కేరళ ఆర్టీసీ, అంబులెన్స్, ఫైర్ సర్వీస్ వంటి వాటికి సంబంధించిన సమాచారం ఉందని తెలిపింది. వాహనాల పార్కింగ్ సమాచారం కూడా ఇందులో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రైలు, రోడ్డు మార్గాల ద్వారా శబరిమల చేరుకునేందుకు సులువైన ప్రాంతాలను వివరించినట్లు తెలిపింది. ఈ పోర్టల్ ద్వారా అయ్యప్ప భక్తులు సులువుగా సన్నిధానం చేరుకునే అవకాశముందని తెలిపారు. ప్రమాదాల బారిన పడినావెంటనే పోలీసులకు ఫోన్ చేసి సాయాన్ని పొందవచ్చని పేర్కొంది.