రాహుల్ కోటరీ నుంచి వారిని?
రాహుల్ గాంధీ కోటరీలో ఉన్న నేతలను పార్టీ పదవుల నుంచి తప్పించే అవకాశాలున్నాయి. వీరిని ఏఐసీపీ పదవులకు దూరంగా ఉంచబోతున్నారు
రాహుల్ గాంధీ కోటరీలో ఉన్న నేతలను పార్టీ పదవుల నుంచి తప్పించే అవకాశాలున్నాయి. వీరిని ఏఐసీపీ పదవులకు దూరంగా ఉంచబోతున్నారు. జీ 23 నేతల ప్రధాన డిమాండ్ ఇదే. రాహుల్ గాంధీ కోటరీ లో ఉన్న కేసీ వేణుగోపాల్, రణ్ దీప్ సుర్జేవాలా, అజయ్ మాకెన్ లు ఏఐసీసీ పదవుల నుంచి తప్పించేందుకు సోనియా సుముఖత చూపినట్లు ప్రచారం జరుగుతుంది. వీరికి సీడబ్ల్యూసీ లేదా పార్లమెంటరీ బోర్డులో పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
వారి డిమాండ్ మేరకు....
జీ 23 నేతలతో ఇటీవల సోనియా గాంధీ వరస సమావేశాలను నిర్వహిస్తున్నారు. గులాం నబీ ఆజాద్, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ, వివేక్ ఠంఖాలతో సోనియా సమావేశమై చర్చించారు. వీరంతా కేసీ వేణుగోపాల్, రణ్ దీప్ సూర్జేవాలా, అజయ్ మాకెన్ లను ఏఐసీసీ పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేయడంతో సోనియా అంగీకరించినట్లు చెబుతున్నారు. మరికొందరు నేతలతోనూ సోనియా సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.