శ్మశానంలో ఘనంగా వివాహం.. అలా ఎందుకు చేశారో తెలుసా

ఆమెకు ఎలాంటి ఆస్తిపాస్థులు లేవు. మనుమరాలు పెళ్లీడుకి వచ్చింది. దాంతో ఆమెకు పెళ్లిచేసేందుకు గ్రామస్తుల సహాయం కోరింది.;

Update: 2023-02-08 06:43 GMT
marriage in crematorium, punjabs amritsar

marriage in crematorium

  • whatsapp icon

ఓ యువతికి శ్మశానంలోనే వివాహం జరిపించిన ఘటన పంజాబ్ లో వెలుగుచూసింది. మొహ్కంపుర గ్రామంలోని శ్మశానికి సమీపంలో ఓ వృద్ధురాలు ఆమె మనుమరాలితో కలిసి ఉంటోంది. ఆమెకు ఎలాంటి ఆస్తిపాస్థులు లేవు. మనుమరాలు పెళ్లీడుకి వచ్చింది. దాంతో ఆమెకు పెళ్లిచేసేందుకు గ్రామస్తుల సహాయం కోరింది. వారిద్దరూ ఎంతో నిజాయితీగా ఉండటం చూసి.. గ్రామస్తులు వారికి సాయం చేసేందుకు ముందుకివచ్చారు.

యువతికి గ్రామస్తులో ఓ పెళ్లిసంబంధం చూసి, వివాహం నిశ్చయించారు. పెళ్లి ఖర్చులకోసం అంతా కలిసి డబ్బు పోగేశారు. పెళ్లి చేసేందుకు మరో చోటు లేకపోవడంతో.. యువతి, తన బామ్మ నివాసం ఉండే శ్మశానంలోనే పెళ్లి జరిపించాలని నిశ్చయించారు. అనుకున్నట్టుగానే వివాహం జరిపించి.. శ్మశానం వెలుపల విందు ఏర్పాటు చేశారు. అనంతరం పెళ్లిబారాత్ నిర్వహించారు.


Tags:    

Similar News