గుడ్ న్యూస్.. నైరుతి ప్రవేశించిందోచ్

భారత వాతావరణ శాఖ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతు పవనాలు అండమాన్ నికోబార్ దీవులలోకి ప్రవేశించాయని తెలిపింది

Update: 2024-05-20 03:57 GMT

భారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతు పవనాలు అండమాన్ నికోబార్ దీవులలోకి ప్రవేశించాయని తెలిపింది. ఈ నెల 31వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని తెలిపింది. గత మూడు నెలల నుంచి మండే ఎండలతో అలమటించిపోతున్న ప్రజలకు మంచి వార్త చెప్పింది ఐఎండీ. రుతుపవనాల రాక ఈ ఏడాది త్వరగా వస్తుందని తెలిపింది. వర్షాలు కూడా ఈ ఏడాది సమృద్ధిగా పడతాయని చెప్పింది.

అధిక వర్షాలు...
సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కింది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు కారణంగా బెంగళూరు వంటి నగరాల్లో బోర్లు ఎండిపోయి నీటి ఎద్దడి కూడా తలెత్తింది. అలాగే వ్యవసాయం కూడా అనేక రాష్ట్రాల్లో దెబ్బతినింది. ప్రాజెక్టుల్లో కూడా నీళ్లు లేక సాగు, తాగునీటికి కూడా ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పినట్లయింద.ి


Tags:    

Similar News