Monsoon : రోహిణి కార్తెలో చల్లటి వార్త చెప్పిన వాతావరణ శాఖ
ఈరోజు కేరళతో పాటు లక్షద్వీప్ ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది
రుతుపవనాలు నేడు కేరళ రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈరోజు కేరళతో పాటు లక్షద్వీప్ ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు విస్తరించేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోకి కూడా ప్రవేశించే అవకాశముందని తెలిపింది.
రోహిణి కార్తె కావడంతో...
రోహిణి కార్తె కావడంతో గత నాలుగు రోజుల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. అనేక చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలను చూసి జనం భయపడిపోతున్నారు. అయితే వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. దీంతో ఈ ఏడాది సీజన్ లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి.