Amarnath Yathra : ఈ నెల 29 నుంచి అమర్‌నాధ్ యాత్ర
భక్తులు ఎంతగానో ఎదురు చూసే అమర్‌నాధ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 29వ తేదీ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది
భక్తులు ఎంతగానో ఎదురు చూసే అమర్‌నాధ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 29వ తేదీ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్ర మొత్తం నలభై ఐదు రోజుల పాటు జరగనుంది. అమర్‌నాధ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం భారీ భద్రతను ఉంచుతుంది. గతం కంటే భద్రతను రెట్టింపు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జమ్మూకాశ్మీర్ లో ఇటీవల యాత్రికులతో ఉగ్రవాదులు దాడులు జరిపిన నేపథ్యంలో భద్రతను మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భక్తుల భద్రత కోసం...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి అమర్‌నాధ్ యాత్రకు పటిష్టమైన భద్రతను కల్పించాలని అధికారులను ఆదేశించారు. అమర్‌నాధ్ యాత్రకు ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు వెళుతుంటారు. ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తుండటంతో భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేయనుంది. ఇందుకు అవసరమైన చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి.