ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర ఎంత తగ్గిందో తెలుసా?
చమురు కంపెనీలు ఏప్రిల్ 1వ తేదీన గుడ్ న్యూస్ చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది;

చమురు కంపెనీలు ఏప్రిల్ 1వ తేదీన గుడ్ న్యూస్ చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల మొదటి రోజున చమురు కంపెనీలు గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులపై ధరలను సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గించాలని నిర్ణయించింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను నలభై ఒక్క రూపాయలు తగ్గించింది.
తగ్గిన ధరలు...
తగ్గిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నట్లు చమురు కంపెనీలు తెలిపాయి. దంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 1,762 రూపాయలుగా ఉంది. చెన్నైలో 1,872 రూపాయలుగా ఉంది. ముంబయిలో 1714 .50 రూపాయలుగా నమోదయింది. గత నెలలో ఆరు రూపాయలను పెంచిన చమురు సంస్థలు ఇప్పుడు నలభై ఒక్క రూపాయలు తగ్గించాయి. దీంతో చిరు వ్యాపారులు ఖుషీ ఫీలవుతున్నారు. హ వినియోగానికి వాడే సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు లేదు.