బ్రేకింగ్ : ఢిల్లీలో మరో ఒమిక్రాన్ కేసు.. 33 కు పెరిగిన కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదయింది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదయింది. జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు రెండుకు పెరిగినట్లయింది. అంతర్జాతీయ ప్రయాణికులందరికీ పరీక్సలు చేసిన తర్వాతనే అనుమతిస్తున్నారు. ఈ కేసుతో దేశంలో ఒమిక్రాన్ కేసులు 33 కు పెరిగినట్లయింది.
మహారాష్ట్రలో ఆంక్షలు....
ఇప్పటివరకూ రాజస్థాన్ లో 9, గుజరాత్ లో మూడు, కర్ణాటకలో రెండు, ఢిల్లీలో రెండు, మహారాష్ట్రలో పదిహేడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకుంది. వీకెండ్స్ లో 144 సెక్షన్ విధించాలని నిర్ణయించింది. మరికొన్ని ఆంక్షలను కూడా విధించే అవకాశముంది.