భారత్ లోకి ఎంటర్ అయిన ఒమిక్రాన్

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించింది. బెంగళూరులో దిగిన ఇద్దరికి ఒమిక్రాన్ గా గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది

Update: 2021-12-02 12:26 GMT

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించింది. బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగిన ఇద్దరు ప్రయాణికులకు ఒమిక్రాన్ వేరియంట్ గా గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. అయితే ఆ ఇద్దరిలో తీవ్ర లక్షణాలు లేవని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు ధృవీకరించింది. నవంబరు 11,20 వ తేదీల్లో బెంగళూరులో దిగిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకిందని తెలిపారు.

ప్రధాని అత్యవసర సమీక్ష....
ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ ను వేగవంతం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ వైరస్ సోకే అవకాశం తక్కువగా ఉందని చెబుతున్నారు. ఒమిక్రాన్ సోకిన వారి కాంట్రాక్ట్స్ ను కూడా బెంగళూరులో ఐసొలేషన్ లోకి తరలించినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.


Tags:    

Similar News