భారత్ లో ఒమిక్రాన్ నాలుగో కేసు
ఒమిక్రాన్ వేరియంట్ భారత్ ను కూడా ఇబ్బంది పెట్టేలా ఉంది. నాలుగు కేసుల భారత్ లో నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది.
ఒమిక్రాన్ వేరియంట్ భారత్ ను కూడా ఇబ్బంది పెట్టేలా ఉంది. నాలుగు కేసుల భారత్ లో నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. తాజాగా ముంబయికి చెందిన ఒక వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ యువకుడు సౌతాఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా ముంబయి చేరుకున్నట్లు గుర్తించారు. దీంతో భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది.
మూడు రాష్ట్రాల్లో....
తొలుత కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులను అధికారులు గుర్తించారు. నిన్న గుజరాత్ లో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఒమిక్రాన్ గా తేలింది. తాజాగా ముంబయి వ్యక్తికి కూడా ఒమిక్రాన్ కేసుగా నమోదు కావడంతో అధికారుల్లో ఆందోళన మొదలయింది. అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.