కలవరం రేపుతున్న ఒమిక్రాన్ వేరియంట్

దక్షిణాఫ్రికాలో బెంబేలెత్తిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ అనుకున్నట్లుగానే ప్రమాదకరంగా పరిణమిస్తుంది

Update: 2021-12-02 06:27 GMT

దక్షిణాఫ్రికాలో బెంబేలెత్తిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ అనుకున్నట్లుగానే ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఆఫ్రికా దేశాల రాకపోకలపై అనేక దేశాలు ఆంక్షలు విధించినా ఫలితం కన్పించడం లేదు. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ 28 దేశాలకు విస్తరించడం ఆందోళన కల్గిస్తుంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సయితం ప్రకటన చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుందని, డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకరమని నిపుణుల హెచ్చరికలతో ప్రపంచదేశాల్లో అనేక దేశాలు ఆంక్షలు విధించాయి.

కఠిన ఆంక్షలొద్దంటూ....
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం దీనిపై పెద్దగా కలవరం చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. అతిగా స్పందించవద్దని, కఠిన ఆంక్షలు విధించవద్దని కూడా దేశాలకు సూచించింది. ఇప్పటికే అనేక దేశాల్లో కోవిడ్ కట్టడి కోసం అనేక చర్యలు చేపట్టారు. మొత్తం మీద ఊహించినట్లుగానే ఒమిక్రాన్ వేరియంట్ అనేక దేశాలకు విస్తరిస్తుండటం ఆందోళన కల్గిస్తుంది.


Tags:    

Similar News