రవ్వ ఇడ్లీ కోసం కౌంటర్‌లో కూపన్ తీసుకున్న నిందితుడు

బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం నాడు జరిగిన బాంబు పేలుడులో

Update: 2024-03-02 03:06 GMT

బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం నాడు జరిగిన బాంబు పేలుడులో 10 మందికి గాయాలయ్యాయి. టైమర్‌ను ఉపయోగించి ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఇడి)ని పేలేలా చేయడం ద్వారా ఈ ప్రమాదం జరిగింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద దర్యాప్తు పురోగతిలో ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని పేలుడు ప్రదేశం నుండి పోలీసులు టైమర్, IED కి సంబంధించిన ఇతర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడుకు ముందు కేఫ్‌లో బ్యాగ్‌ను ఉంచడం CCTV ఫుటేజీలో మనం చూడొచ్చు. నిందితుడిని కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు

ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. నిందితుడి వయసు 28- 30 ఏళ్లు ఉండొచ్చని.. రవ్వ ఇడ్లీ కోసం కౌంటర్‌లో కూపన్ కూడా తీసుకున్నాడని వివరించారు. అయితే కూపన్ తీసుకున్న నిందితుడు అది తినకుండానే బ్యాగ్‌ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఘటనా స్థలంలో మరే ఇతర బాంబులు లభించలేదని తెలిపారు. నిందితుడికి టోకెన్ ఇచ్చిన క్యాషియర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటనలో కేఫ్ సిబ్బందితో పాటు ఓ కస్టమర్ గాయపడ్డాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై హెఏఎల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బెంగళూరు పోలీసులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కూడా ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. ఏడెనిమిది బృందాలను ఏర్పాటు చేశామని, నిందితులను వీలైనంత త్వరగా కనిపెట్టడమే కీలకమని సీనియర్ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News