శబరిమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్

అయ్యప్ప భక్తులకు శబరిమల ఆలయ బోర్డు కీలక సూచన చేసింది;

Update: 2025-01-02 02:30 GMT

అయ్యప్ప భక్తులకు శబరిమల ఆలయ బోర్డు కీలక సూచన చేసింది. అయ్యప్ప దర్శనం కోసం అటవీ మార్గంలో కాలినడకన వెళ్లే భక్తులకు జారీ చేసే ప్రత్యేక పాస్‌లు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించింది. వర్చ్యువల్ క్యూ లైన్.. స్పాట్ బుకింగ్ ద్వారా వచ్చే భక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

రద్దీ ఎక్కువగా ...
ఈ మేరకు ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు ప్రకటన విడుదల చేసింది. శబరిమలలో భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. మండల పూజతో పాటు మకర సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం వరకూ ఈ నిబంధనలను అమలులో ఉంటాయని పేర్కొంది. శబరిమలకు వచ్చే భక్తులు ఈ నిబంధనలను పాటించాలని కోరింది.


Tags:    

Similar News