బంగారం బహుమతులను వెనక్కు పంపిన ఎంపీ

రైల్వే స్టాండింగ్ కమిటీకి బీహార్ ఎంపీ సుదామ ప్రసాద్ ఘాటు లేఖ రాశారు.

Update: 2024-11-28 07:18 GMT

రైల్వే స్టాండింగ్ కమిటీకి ఎంపీ సుదామ ప్రసాద్ ఘాటు లేఖ రాశారు. రైల్వే స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్ లో ఖరీదైన కానుకలను ఇవ్వడం పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. ఖరీదైన కానుకలను సభ్యులకు ఇచ్చారని ఆయన లేఖ రాశారు. గత అక్టోబరు 31వ తేదీ నుంచి ఈ నెల 7వ తేదీ వరకూ రైల్వే స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్ చేసింది. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు ప్రాంతాల్లో ఈ కమిటీ పర్యటించింది.

స్టాండింగ్ కమిటీకి ఘాటు లేఖ
అయితే ఈ సందర్భంగా సభ్యులకు ఇచ్చిన కానుకల్లో గ్రాము బంగారం, వంద గ్రాముల వెండి ఉన్నాయని సుదామ ప్రసాద్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. తనకు అందచేసిన బహుమతులను ఆయన వెనక్కు పంపారు. దీంతో పాటు లేఖలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు ఖరీదైన ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేస్తున్నారని, ప్రజా సేవ చేయడానికి వచ్చిన మనకు ఇది సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఈ కమిటీకి నాయకత్వం వహించిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు లేఖ రాయడం ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది.


Tags:    

Similar News