Tamilnadu : తమిళనాడులో భారీ వర్షాలు.. ఐదు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

తమిళనాడుకు తుపాను ప్రభావం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఐదు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది

Update: 2024-11-27 04:10 GMT

తమిళనాడుకు తుపాను ప్రభావం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఐదు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఇప్పటికే అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం ఈరోజు సాయంత్రానికి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్నిచేపట్టారు. భారీ వర్షాలు నాలుగు రోజులు పాటు ఉంటాయని చెప్పడంతో తమిళనాడు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తుంది.

ముందస్తు ఏర్పాట్లు...
అదే సమయంలో మత్స్యకారులను కూడా చేపల వేటను నిషేధించింది. తమిళనాడు, పుదుచ్చేరిలకు రెడ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ అధికారుల ప్రకటించడంతో ప్రత్యేక అధికారులను జిల్లాల వారీగా నియమించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. రహదారుల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా కొన్ని చోట్ల సెలవులు ప్రకటించారు. అయితే అధికారులకు మాత్రం సెలవులను తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది. మొత్తం మీద తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు హై అలెర్ట్ జారీ చేింది.


Tags:    

Similar News