Hemant Soren : నేడు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా నేడు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు;
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా నేడు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొరాబాద్ స్టేడియంలో సాయంత్రం నాలుగు గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, పంజాబ్ ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, కొన్నాడ్ సంగ్రామ్, భగవంత్ మాన్ సింగ్ లు హాజరు కానున్నారు.
ఇటీవల ఎన్నికల్లో...
జార్ఖండ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే సోరెన్ తమ శాసనసభ పక్ష నేతగా జేఎంఎం నేతలు ఎన్నుకున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో జార్ఖండ్ లో ఉన్న 81 అసెంబ్లీ స్థానాలకు గాను యాభై ఆరు స్థానాల్లో గెలిచింది. బీజేపీ కూటమికి కేవలం 24 స్థానాలు మాత్రమే దక్కాయి. దీంతో నేడు ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.