నేడు తేలనున్నమహారాష్ట్ర సీఎం అభ్యర్థి

నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది తెలియనుంది. ఢిల్లీలో మహాయుతి నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ కానున్నారు;

Update: 2024-11-28 04:25 GMT

నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది తెలియనుంది. ఢిల్లీలో మహాయుతి నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవిస్ పేరు దాదాపుగా ఖరారయిందని ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఇద్దరూ అంగీకరించడంతో...
ఆపధ్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండేతో పాటు, అజిత్ పవార్ కూడా ఫడ్నవిస్ సీఎం అభ్యర్థిత్వానికి మొగ్గు చూపారన్న వార్తలు వస్తున్నాయి. అయితే మహాయుతి నేతలందరూ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు నిర్ణయిస్తారని, వారి నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.


Tags:    

Similar News