Parlament Session : ఉభయసభలను కుదిపేసిన అదానీ అంశం
పార్లమెంటు ఉభయసభలను పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అంశం కుదిపేసింది;
పార్లమెంటు ఉభయసభలను పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అంశం కుదిపేసింది. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంతో దానిపై చర్చించాలని ఉభయసభల్లో విపక్ష కూటమి నేతలు పట్టుబట్టారు. ఈ సందర్భంగా సభ్యుల నినాదాలతో ఉభయ సభలు హోరెత్తిపోయాయి. అదానీ వ్యవహారంపై విపక్షం చర్చకు పట్టుబట్టింది.
లోక్ సభలోనూ...
అయితే లోక్ సభ స్పీకర్ దానిని అనుమతించకపోవడంతో నినాదాలు చేశారు. లోక్ సభ ప్రారంభం కాగానే విపక్షాలు అదానీ అంశంపై చర్చించాలని పట్టుబట్టినా స్పీకర్ ఓం బిర్లా అందుకు అనుమతించలేదు. దీంతో స్పీకర్ ఎల్లుండికి సభను వాయిదా వేశారు. రాజ్యసభ కూడా బుధవారానికి వాయిదా పడింది. ఇండి కూటమి పక్షాల నేతలు పట్టుబట్టినా స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ అంగీకరించకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది.