టికెట్ కొని రైలులో ప్రయాణించిన ప్రధాని

ప్రధాని మోదీ మెట్రో రైలు టికెట్ ను కొనుగోలు చేసి.. రైలులో ప్రయాణించారు. గర్వారే మెట్రో స్టేషన్ నుంచి ఆనంద్ నగర్ స్టేషన్

Update: 2022-03-06 11:26 GMT

పూణె : మహారాష్ట్రలో ముంబై తర్వాత.. రెండవ అతిపెద్ద నగరమైన పూణెలో మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం పూణె మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. తొలుత పూణె మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద 9.5 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గర్వారే మెట్రో స్టేషన్ కు చేరుకున్న ప్రధాని.. పచ్చ జెండా ఊపి పూణె మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మెట్రో రైలు టికెట్ ను కొనుగోలు చేసి.. రైలులో ప్రయాణించారు. గర్వారే మెట్రో స్టేషన్ నుంచి ఆనంద్ నగర్ స్టేషన్ వరకూ సామాన్యులతో కలిసి మోదీ ప్రయాణించడం విశేషం. కాగా.. 2016 డిసెంబర్ 24న పూణె మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ప్రాజెక్టు అంచనా రూ.11,440 కోట్లు కాగా.. సిటీలో మొత్తం 32.2 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైల్ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం 12 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని మోదీ ప్రారంభించారు.


Tags:    

Similar News