Breaking : ఉగ్రదాడి జరిగే అవకాశముంది.. రాష్ట్రాలకు కేంద్రం హై అలెర్ట్
రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.;

రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా తీర ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సముద్ర తీర ప్రాంతాల్లో నిఘా పెంచాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హై అలెర్ట్ జారీ చేయడంతో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి.
డ్రోన్లు, ఐఈడీలతో...
డ్రోన్లు, ఐఈడీలతో ఉగ్రవాదులు దాడులకు దిగే అవకాశముందని హెచ్చరించింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలోని పట్టణాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దాడులు చేసే అవకాశముందని, నిఘాను పెంచడంతో పాటు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.