దేశంలో నిలిచిన యూపీఐ సేవలు

భారత్ లో మరోసారి యూపీఐ సేవలు నిలిచిపోయాయి. దేశ వ్యాప్తంగా వినియోగదారులు ఇబ్బంది పడ్డారు;

Update: 2025-04-12 07:22 GMT
UPI services,  down, users, india
  • whatsapp icon

భారత్ లో మరోసారి యూపీఐ సేవలు నిలిచిపోయాయి. దేశ వ్యాప్తంగా వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. యూపీఐ సేవలు నిలిచిపోవడంతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల కాలంలో తరచూ యూపీఐ సేవల్లో అంతరాయం వినియోగదారులను ఇబ్బంది పెడుతుంది. ఎక్కువ మంది ఈ సేవల ద్వారానే పేమెంట్ చేస్తుండటంతో అది పనిచేయకపోవడంతో లావాదేవీలు నిలిచిపోయాయి.

గడిచిన ఇరవై నాలుగు గంటల్లో...
ఈరోజు ఇరవై నాలుగు గంటల నుంచి యూపీఐ సేవలు డౌన్ అయినట్లు డౌన్ డిటెక్టర్ ప్రకటించిది. గూగుల్ పే, పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి వాటి నుంచి అనేక పేమెంట్స్ సమస్యలు ఎదురయినట్లు ఫిర్యాదులు రావడంతో మరోసారి అలెర్ట్ అయింది. అయితే తరచూ తలెత్తే యూపీఐ సేవల్లో అంతరాయాలను అరికట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.


Tags:    

Similar News