Tamilandu :తమిళనాడు కొత్త బీజేపీ చీఫ్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ ఎంపికయ్యారు.;

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ ఎంపికయ్యారు. ఆయన తిరునల్వేలి ఎమ్మెల్యేగా ఉన్నారు. చెన్నైలో నిర్వహించిన సమావేశంలో పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ లు నాగేంద్రన్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్ష పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఆయనను ఎంపిక చేశారు.
అమిత్ షా సూచన మేరకు...
అయితే కేంద్ర మంత్రి అమిత్ షా సూచనల మేరకు నాగేంద్రన్ ను నియమించాలని ముందే ఖరారయినట్లు పెద్దయెత్తున ప్రచారం జరిగింది. ఇప్పటికే అన్నాడీఎంకే, బీజేపీలు తమిళనాడులో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంతో గతంలో అన్నాడీఎంకేలో పనిచేసిన నాగేంద్రన్ ను అధ్యక్ష పదవికి ఎంపిక చేసి రెండు పార్టీల మధ్య సఖ్యత చేకూరేలా నిర్ణయం తీసుకన్నట్లయింది. నాగేంద్రన్ పూర్వపు అధ్యక్షుడు అన్నామలై నుంచి బాధ్యతలను స్వీకరించారు. సీట్ల సర్దుబాటులో కూడా సమస్యలు రాకుండా ఉండేందుకే ఆయనను ఎంపిక చేసినట్లు కనపడుతుంది.