నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.;

నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.మనీలాండరింగ్ కు పాల్పడిన కేసులో స్థిరాస్థులను స్వాధీనం చేసుకునేందుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఢిల్లీతో పాటు ముంబయి, లక్నోలో ఉన్న ఆస్తులపై ఈడీ అధికారులు నోటీసులు అంటించారు. ఈ ఆస్తులను వెంటనే ఖాళీ చేయాలని, వాటి నుంచి వచ్చే అద్దెను బదిలీ చేయాలని నోటీసుల్లో పేర్కొంది.
స్థిరాస్థుల స్వాధీనానికి...
నేషనల్ హెరాల్డ్ పత్రికకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ ప్రమోటర్లుగా ఉన్నారు. ఈ సంస్థ కాంగ్రెస్ కు ఏజేఎల్ బకాయీ పడని 90 కోట్లను వసూలు చేసుకునేందుకు యంగ్ ఇండియన్ లో ఆర్థికఅవకతవకలు జరిగాయన్న ఆరోపణలప ఈడీ దర్యాప్తు చేసింది. రెండేళ్ల క్రితం దీనికి సంబంధించిన 90.21 కట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇప్పుడు వీటిని స్వాధీనం చేసుకోవడానికి నోటీసులు జారీ చేసింది.