పేదల కోసమే ఈ సర్కార్ : రాష్ట్రపతి
పేదల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు
పేదల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. పేదలు, గిరిజనులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మూడు కోట్ల మంది పేదలకు సొంత ఇళ్లు నిర్మించారన్నారు. మహిళ సాధికారితను ప్రోత్సహిస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు.
రైతాంగాన్ని ఆదుకునేందుకు...
రైతాంగాన్ని ఆదుకునేందుకు అనేక పథకాలను రూపొందించామని తెలిపారు. చిన్న, సన్నకారు రైతుల కోసం ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటి పథకాలను తెచ్చామని రాషట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పంట నష్టపోయినా అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేశామని, వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు.