స్వల్పంగా తగ్గిన బంగారం ధర
దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాములపై రూ.250 రూపాయలు తగ్గింది. వెండి ధర రూ.200 ల మేర పెరిగింది.
బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో? ఎప్పుడు పెరుగుతుందో? చెప్పలేం. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులను అనుసరించి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి బాగా డిమాండ్ ఏర్పడింది. అయినా రెండు రోజుల నుంచి బంగారం ధర కొంత తగ్గుతూ వస్తుంది. జాతీయ బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వల ప్రభావం కూడా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పెరిగిన వెండి...
దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాములపై రూ.250 రూపాయలు తగ్గింది. వెండి ధర రూ.200 ల మేర పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,440 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో రూ.66,000లుగా ఉంది.